మిరియాల వారి స్వాగతం

 

ఉగ్గుపాలనుండి ఉయ్యాలలోననుండి
అమ్మ పాట పాడినట్టి భాష
తేనెవంటి మందు వీనులకును విందు
దేశభాషలందు తెలుగులెస్స!

సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవభాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు

వేనవేల కవుల వెలుగులో రూపొంది
దేశదేశములను వాసిగాంచి
వేయి యేండ్లనుండి విలసిల్లు నా "భాష"
దేశ భాషలందు తెలుగు లెస్స!

- మిరియాల రామకృష్ణ.